![]() |
![]() |
.webp)
జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 మార్చ్ 2 నుంచి ప్రతీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది. ఇక దీనికి సంబంధించి ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమోలో రోజా డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఐతే ఈ షోకి హోస్టస్ గా యాంకర్ రవి, అష్షు రెడ్డి వ్యవహిస్తున్నారు. ఇక ఈ షోకి అందాల నటుడు శ్రీకాంత్ ఆయనకు అటు రాశి, ఇటు రోజా నిలబడి చిన్న స్టెప్స్ వేశారు. ఇక శ్రీకాంత్ ఐతే వీళ్ళ మీద కామెంట్స్ కూడా చేసాడు. "రాశి నవ్వితే ముత్యాలు రాల్తాయి..రోజా దగ్గర ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాల్తాయి" అని చెప్పేసరికి రోజా, అష్షురెడ్డి నవ్వేశారు.
ఇక ఈ సీజన్ ఛాంపియన్ షిప్ కి శ్రీకాంత్, రోజా, రాశి జడ్జెస్ గా వ్యవహరించబోతున్నారు. ఇక జీ తెలుగులో ప్రసారమయ్యే 16 సీరియల్స్ ఇప్పుడు ఒక ఛాంపియన్ షిప్ కోసం ఫైట్ చేసే ఒక రియాల్టీటీ షో ఇప్పుడు ఆడియన్స్ ని సరికొత్తగా ప్రతీ ఆదివారం అలరించడానికి రాబోతోంది. రోజా పాలిటిక్స్ లోకి వెళ్ళాక బుల్లితెర షోస్ కి బైబై చెప్పింది. ఇక ఇప్పుడు పాలిటిక్స్ నుంచి ఫ్రీ అయ్యాక ఆమె చేస్తున్న మొదటి రియాలిటీ షో ఇది. ఇక నటి రాశి సిల్వర్ స్క్రీన్ మీద ఎన్నో మూవీస్ చేసింది. ఇక ఇప్పుడు బుల్లితెర మీద కూడా కొన్ని సీరియల్స్ లో చేసింది. గిరిజా కల్యాణం, జానకికలగనలేదు వంటి హిట్ సీరియల్స్ లో నటించింది. ఇక శ్రీకాంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్కౌంటర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీకాంత్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించి నెమ్మదిగా హీరోగా మారారు. సురేశ్ ప్రొడక్షన్లో వచ్చిన తాజ్‌మహల్ సినిమా శ్రీకాంత్ కెరీర్‌ను మలుపుతిప్పింది. తర్వాత రాఘవేంద్రరావు పెళ్లిసందడి మూవీతో కథానాయకుడిగా సెటిల్ అయ్యాడు. శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీలో శ్రీకాంత్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇలా త్రి లెజెండరీ నటులు ఈ షోకి జడ్జెస్ గ వ్యవహరించబోతున్నారు.
![]() |
![]() |